నేను రాజీనామాకు సిద్దం...బండి సిద్దమేనా? కేటీఆర్‌

September 14, 2021


img

మంత్రి కేటీఆర్‌ మంగళవారం గద్వాల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తూ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. 

“రాష్ట్రంలో అన్ని సంక్షేమ పధకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందంటూ బండి సంజయ్‌ ఊరూఋ తిరుగుతూ ప్రజలకు పచ్చి అబద్దాలు చెపుతున్నారు. ఒకవేళ రాష్ట్రాలలో సంక్షేమ పధకాలకు కేంద్రమే నిధులు ఇస్తున్నట్లయితే పక్కనే ఉన్న బిజెపి పాలిత కర్ణాటకలో కూడా ఈ పధకాలన్నీ ఎందుకు అమలుచేయడం లేదు? వాస్తవానికి ఈ ఆరున్నరేళ్ళలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు వెళ్ళగా తిరిగి ఇచ్చింది మాత్రం కేవలం రూ.1.42 కోట్లు మాత్రమే. మనం కష్టపడి సంపాదించి చెల్లిస్తున్న ఈ పన్ను సొమ్మును కేంద్రప్రభుత్వం బిజెపి పాలిత యూపీ రాష్ట్రంలో ఖర్చు చేస్తోంది. తెలంగాణ రైతులు పండించిన దొడ్డు ధాన్యం కొనలేమని చెపుతోంది. నేను చెపుతున్నది వాస్తవాలు కావని నిరూపిస్తే రాజీనామా చేస్తాను. బండి సంజయ్‌ తన ఆరోపణలను నిరూపించగలరా? లేకుంటే రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. 


Related Post