మధ్యవర్తిత్వం వద్దు న్యాయపోరాటమే ముద్దు!

August 04, 2021


img

కృష్ణాజలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాల మద్య పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ ప్రభుత్వానికి మద్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కాదు కూడదు న్యాయపోరాటమే చేస్తామంటే తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవాడిని కనుక ఈ కేసును మరో బెంచీకి బదిలీ చేస్తానని చెప్పారు. జస్టిస్ ఎన్వీ రమణ సూచనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటానికే మొగ్గుచూపుతున్నట్లు తెలియజేయడంతో, ఆయన ఈ కేసును వేరే ధర్మశనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. కనుక ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య ఈ కేసుపై న్యాయపోరాటం మొదలైంది. ఇది ఎంతకాలం సాగుతుందో... ఎప్పటికీ పరిష్కారం లభిస్తుందో? అసలు కోర్టులో పరిష్కారం లభిస్తుందో లేదో?తెలీదు. ఒకవేళ సుప్రీంకోర్టు పరిష్కారం చూపినా, ఈ సమస్య రాజకీయాలతో ముడిపడి ఉన్నందున కోర్టు తీర్పుకు రెండు ప్రభుత్వాలు కట్టుబడి ఉంటాయో లేదో అనుమానమే. కోర్టు తీర్పు, దానిపై తెలుగు ప్రభుత్వాల వైఖరి ఏవిదంగా ఉన్నప్పటికీ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటం కోసం రెండు ప్రభుత్వాలు ఈ న్యాయపోరాటానికి భారీగా ప్రజాధనం ఖర్చు చేయబోతున్నాయని స్పష్టమవుతోంది. 


Related Post