భారత్‌కు మరో పతకం...ఈసారి కూడా మహిళా క్రీడాకారిణే

August 04, 2021


img

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. బుధవారం ఉదయం భారత బాక్సర్ లోవ్లీనా బోర్గోహైన్‌ టర్కీ బాక్సర్ బ్యూస్ నాజ్ సూర్మా నేలితో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడింది. 64-69 కిలోల బాక్సింగ్ విభాగంలో జరిగిన టర్కీ బాక్సర్ సుర్మేనెలి చేతిలో 0-5 తేడాతో లోవ్లీనా ఓటమిపాలైంది. అయినప్పటికీ ఆమె సెమీ ఫైనల్ రౌండ్‌ చేరుకోవడంతో కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు కాంస్య, ఒక రజతం పతకాలు లభించాయి. ఆ మూడు మహిళా క్రీకారులే సాధించడం విశేషం. మొదట వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను,  తర్వాత బ్యాడ్మింటన్‌లో పీవీ. సింధు, తాజాగా బాక్సింగ్‌లో లోవ్లీనా బొర్గోహెయిన్ పతకాలు తెచ్చారు.Related Post