బెల్జియం చేతిలో భారత్‌ హాకీ జట్టు ఓటమి

August 04, 2021


img

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు మంగళవారం జరిగిన మొదటి సెమీఫైనల్స్ లో బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమితో భారత హాకీజట్టు ఫైనల్లోకి అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయింది. భారత హాకీజట్టు లీగ్ దశలో జరిగిన అన్ని మ్యాచ్‌లలో ప్రత్యర్ధులకు గట్టి పోటీనిచ్చింది. కానీ, సెమీఫైనల్స్ లో ఒత్తిడికి లోనవడంతో భారత్‌ జట్టుపై 2-5 గోల్స్ తేడాతో బెల్జియం జట్టు విజయం సాధించింది. దీంతో బెల్జియం ఫై నల్స్ లోకి వెళ్లింది. భారత హాకీ జట్టు ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికి  గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో పాల్గొని విజయం సాధిస్తే కాంస్య పతకం దక్కుతుంది.Related Post