సిఎం కేసీఆర్‌ రేపు వాసాలమర్రిలో పర్యటన

August 03, 2021


img

సిఎం కేసీఆర్‌ రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో దళితవాడకు వెళ్ళి అక్కడ వారితో కాసేపు మాట్లాడుతారు. తరువాత గ్రామంలో నిర్మించిన రైతువేదికలో గ్రామస్తులతో సమావేశమవుతారు. వాసాలమర్రి గ్రామం అభివృద్ధికి సంబందించిన పనుల జాబితాను ఇప్పటికే అధికారులు సిద్దం చేశారు. రేపు రైతువేదికలో జరిగే సమావేశంలో వాటిపై సిఎం కేసీఆర్‌ ప్రకటన చేస్తారు.

సిఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా వాసాలమర్రి గ్రామంలో భద్రతాసిబ్బంది పటిష్టమైన భద్రతాఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికారులు, టిఆర్ఎస్‌ నేతలు రేపటి కార్యక్రమం కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వాసాలమర్రిని అన్ని విదాల అభివృద్ధి చేయడంతో పాటు గ్రామంలోని ప్రతీ కుటుంబానికి జీవనోపాధి కల్పించేందుకు కూడా అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు.

ఈనెల 16న  సిఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో దళిత బంధు పధకాన్ని ప్రారంభించనున్నారు కనుక తరువాత వాసాలమర్రిలోని దళిత కుటుంబాలకు కూడా ఆ పధకం కింద రూ.10 లక్షల చొప్పున ఆర్ధికసాయం అందించడం ఖాయమే కానీ ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారనే విషయం సిఎం కేసీఆర్‌ రేపటి పర్యటనలో ప్రకటించే అవకాశం ఉంది.


Related Post