ఈటల రాజేందర్‌కు శస్త్రచికిత్స

August 02, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్లో వైద్యులు మోకాలికి శస్త్రచికిత్స చేశారు. మొన్న శుక్రవారం ప్రజాదీవెన పాదయాత్ర చేస్తుండగా వీణవంక మండలంలో కొండపాక గ్రామం వద్ద హటాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన బీపీ, ఆక్సిజన్‌ లెవెల్స్ పడిపోయాయి. జ్వరంతో ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆయనను మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు మోకాలు సమస్య కూడా ఉన్నట్లు గుర్తించి సోమవారం శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొన్నందున ఇక పాదయాత్ర చేయడం సాధ్యం కాదు. కానీ హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఆయనకు చాలా ప్రతిష్టాత్మకమైనవి కనుక ఆయన సతీమణి ఈటల జమున ప్రజాదీవెన పాదయాత్ర కొనసాగించవచ్చని సమాచారం.    Related Post