వీణవంకలో ఈటలకు దళితులు షాక్!

July 22, 2021


img

సిఎం కేసీఆర్‌ ప్రకటించిన దళిత బంధు పధకం అప్పుడే హుజూరాబాద్‌ ఓటర్లపై ప్రభావం చూపుతోంది. ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈటల రాజేందర్‌ ఇటీవల వీణవంక మండలంలో తన ఫోటో ముద్రించిన గోడ గడియారాలను ప్రజలకు పంచిపెట్టారు. మండలంలోని చల్లూరు, ఎల్బాక గ్రామాలలోని దళితులు నిన్న వాటిని రోడ్డుపై పగులగొట్టి నిరసన తెలియజేశారు. ఈటల రాజేందర్‌ ఏనాడూ తమ బాధలను పట్టించుకోలేదని, ఏనాడూ తమ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించలేదని కానీ తమ ఓట్ల కోసం రూ.90ల గోడ గడియారాలు పంచిపెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌ తన ఆస్తులను కాపాడుకోవడానికే బిజెపిలో చేరారని, కానీ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని చెప్పుకొంటూ నియోజకవర్గంలో ఓటర్లను ఈవిదంగా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఇకనైనా ఈటల రాజేందర్‌ అబద్దాలు చెప్పడం, ఓటర్లను ప్రలోభ పెట్టడం మానుకోవాలని వారు హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పధకంతోనే దళితుల జీవితాలు బాగుపడతాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.          



Related Post