వరంగల్‌లో పర్యటిస్తున్న సిఎం కేసీఆర్‌

June 21, 2021


img

నేడు సిఎం కేసీఆర్‌ వరంగల్‌లో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో హన్మకొండకు చేరుకొన్న సిఎం కేసీఆర్‌, అక్కడి నుంచి నేరుగా స్థానిక ఏక‌శిలా పార్కుకు వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం ప్రస్తుతం వరంగల్‌ సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో కొత్తగా నిర్మించబోతున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. సుమారు 5 ఏకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. 

ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మధ్యాహ్నం మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటికి వెళ్ళి ఆయనతో కలిసి భోజనం చేసి కాసేపు విశ్రమిస్తారు. మళ్ళీ మంత్రి హరీష్‌రావు 3 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లాకు బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. Related Post