తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

June 20, 2021


img

నిన్న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ ఎత్తి వేసినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 

• సామాజిక దూరం పాటించడం, విధిగా మాస్కులు ధరించడం

•  మాస్కు  దర్శించని వారికి రూ 1000 రూపాయల జరిమానా విధించనున్నారు. 

• ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపులలో కరోనా నిబంధనను కచ్చితంగా పాటించాలి. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద చర్యలు తీసుకుంటారు. 

 రాష్ట్ర మంత్రివర్గ ముఖ్య నిర్ణయాలు:

• హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఉన్న టిమ్స్ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆధునీకరించడం

• ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం

•  అల్వాల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం. 

• జూలై 1వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు పునః ప్రారంభం.


Related Post