డబ్ల్యుటిసి టెస్ట్ మ్యాచ్‌ రెండోరోజు 3 వికెట్లకు భారత్‌ 146 పరుగులు

June 20, 2021


img

వరుణుడు కరుణించడంతో సౌతాంప్టన్‌లో రోజ్ బౌల్ స్టేడియంలో భారత్ వర్సెస్ మధ్య న్యూజిలాండ్ చివరి మ్యాచ్ శనివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉంది కానీ వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు. రెండో రోజు న్యూజిలాండ్ టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండో రోజు ఆట ఇంకా కొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే వెలుతురు లేని కారణంగా ఎంపైర్లు  నిలిపివేశారు. ఆట నిలిపివేసే సమయానికి భారత్ 146 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జెమినీ సన్, వ్యాగనార్‌లకు తలో వికెట్ పడ్డాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 44, రహనా 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది.Related Post