ప్రపంచంలో ప్రధాని మోడీ నెంబర్: 1

June 19, 2021


img

అత్యంత ప్రజాధారణ కలిగిన ప్రపంచ దేశాధినేతలలో భారత ప్రధాని నరేంద్రమోడీ నెంబర్: 1 స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ మొత్తం 13 దేశాధినేతలకున్న ప్రజాధారణ గురించి తెలుసుకొనేందుకు ఓ సర్వే చేసింది. ఆ సర్వేలో పాల్గొన్నవారిలో ఎంత శాతం మంది తమ దేశాధినేతల పట్ల అనుకూలంగా ఓట్లు వేశారో మార్నింగ్ కన్సల్ట్ నివేదిక రూపంలో తెలియజేసింది.     

భారత్‌లో సర్వేలో పాల్గొన్నవారిలో 66 శాతం మంది ప్రజలు ప్రధాని నరేంద్రమోడీకి అనుకూలత వ్యక్తం చేయగా, మరో 28 శాతం మంది వ్యతిరేకించారు. 2019 ఆగస్ట్ నెలలో జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదాను కల్పిస్తున్నా ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత ప్రధాని నరేంద్రమోడీకి ప్రజాధారణ 82 శాతానికి చేరింది. కానీ ఆ తరువాత కరోనా, లాక్‌డౌన్‌ తదితర అంశాల కారణంగా ప్రధాని నరేంద్రమోడీ 20 పాయింట్లు కోల్పోయి ప్రస్తుతం 66 శాతంలో ఉన్నారు. అయినప్పటికీ ప్రపంచ దేశాధినేతలందరి కంటే ప్రధాని నరేంద్రమోడీయే అగ్రస్థానంలో ఉన్నారు.  

 ప్రపంచంలో అత్యంత వివాదాస్పదుడైన డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన జో బైడెన్‌ రెండో స్థానంలో ఉంటారని భావించడం సహజమే కానీ ఆయన పట్ల అమెరికాలో కేవలం 53 శాతం మంది అనుకూలంగా ఓటు వేయడంతో 6వ స్థానంలో నిలిచారు. 

ప్రధాని నరేంద్రమోడీ తరువాత స్థానాలలో ఇటలీ ప్రధాని మారియో ద్రాఘీ (65%), మెక్సికో అధ్యక్షుడు ఆండ్రూస్ ఇమ్మానుయెల్ (63%), ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (54%), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (53%), కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో (48%), బ్రిటన్ ప్రధాని జాన్సన్ (44%) నిలువగా జపాన్ ప్రధాని యోషిహిదే సూగా కేవలం 29 శాతం ఓట్లతో అత్యంత తక్కువ ప్రజాధారణ కలిగిన నేతలలో ఒకరిగా నిలిచారు.


Related Post