ఏపీలో మే నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

May 17, 2021


img

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 5 నుంచి 18వరకు విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, మందుల దుకాణాలు మొదలైనవాటికి మినహాయింపు ఉంటుంది. 

ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూను నెలాఖరు వరకు కొనసాగిస్తేనే రాష్ట్రంలో కరోనాను నియంత్రణలోకి వస్తుందని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్ళనాని తెలిపారు. కనుక బ్లాక్ ఫంగస్ వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని దానిని ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు.


Related Post