వరంగల్‌, ఖమ్మం మేయర్, డెప్యూటీ మేయర్ వీరే

May 07, 2021


img

వరంగల్‌, ఖమ్మం నగరాల మేయర్, డెప్యూటీ మేయర్ పేర్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. 

వరంగల్‌ నగర మేయరుగా 26వ డివిజన్‌ నుంచి గెలిచిన పునుకొల్లు నీరజ, డెప్యూటీ మేయరుగా 37వ డివిజన్‌ నుంచి గెలిచిన ఫాతిమా జోహ్రాలను ఎంపిక చేసినట్లు ఈ ఎన్నిక పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.  

ఖమ్మం నగర మేయరుగా 29వ డివిజన్‌ నుంచి గెలిచిన గుండు సుధారాణి, డెప్యూటీ మేయరుగా 36వ డివిజన్‌ నుంచి గెలిచిన రిజ్వానా షమీమ్‌ల పేర్లను ఎన్నికల పరీశీలకుడిగా వ్యవహరిస్తున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. 

ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు వీరు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరికొద్ది సేపటిలో సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాల ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పేర్లు కూడా వెలువడనున్నాయి.


Related Post