తమిళనాడు సిఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం

May 07, 2021


img

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ఎంకె స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్ పురోహిత్ స్టాలిన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్‌తో పాటు మరో 34 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

దశాబ్ధాలపాటు తమిళనాడు రాజకీయాలను శాశించిన జయలలిత, కరుణానిధి మరణించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలివి. ఈ ఎన్నికలలో డీఎంకె, కాంగ్రెస్‌ కూటమి 156 సీట్లు, అన్నాడీఎంకె, బిజెపి కూటమి 78 సీట్లు గెలుచుకోవడంతో పదేళ్ళ సుదీర్గ నిరీక్షణ తరువాత డీఎంకె పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. Related Post