క్రికెటర్లకు కరోనా...ఐపీఎల్ నిరవధిక వాయిదా

May 04, 2021


img

ఐపీఎల్ సీజన్ 14లో పలువురు క్రికెటర్లకు  కరోనా వైరస్ సోకడంతో మిగిలిన మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం ప్రకటించారు. నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోని సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తిలకు కరోనా వైరస్ నిర్ధారణ అవడంతో నిన్న జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. అయితే తాజాగా ఈరోజు సన్ రైజర్స్ జట్టులోని వృద్ధిమాన్ సాహా, అమిత్ మిశ్రాలకు కూడా కరోనా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన బీసీసీఐ ఐపీఎల్ సీజన్ 14లో మిగిలిన మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. Related Post