విశాఖ మాజీ మేయర్ సబ్బంహరి కరోనాతో మృతి

May 03, 2021


img

మాజీ కాంగ్రెస్‌ ఎంపీ, వైజాగ్ మాజీ మేయర్, సీనియర్ టిడిపి నేత సబ్బం హరి (69) ఈరోజు మధ్యాహ్నం విశాఖలోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా సోకడంతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొంటున్నారు. అయితే ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండటంతో పరిస్థితి విషమించి చనిపోయారు. 

ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై తనదైన శైలిలో సునిశిత విమర్శలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. 1995లో విశాఖ నగర మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత విశాఖ నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసారు. అప్పటి నుంచే విశాఖ నగరం సి పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. 

సబ్బం హరి మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.      Related Post