తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తాజా అప్‌డేట్స్ @ మ.2.50 గంటలు

May 03, 2021


img

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్‌ ప్రభంజనం కొనసాగుతోంది. 

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 సీట్లలో ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాలలో టిఆర్ఎస్‌ 15, కాంగ్రెస్‌ 6, బిజెపి 1 సీటు గెలుచుకొన్నాయి. 

వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో 66 సీట్లలో ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాలలో టిఆర్ఎస్‌ 24, బిజెపి 9, కాంగ్రెస్‌ 4, ఇతరులు 2 సీట్లు గెలుచుకొన్నారు. 

సిద్ధిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులలో ఇప్పటివరకు 21 వార్డుల ఫలితాలు ప్రకటించగా వాటిలో 19 వార్డులను టిఆర్ఎస్‌ గెలుచుకొంది. 17వ వార్డులో బిజెపి, 20వ వార్డులో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు.  

అచ్చంపేట పురపాలక సంఘంలో మొత్తం 20 వార్డులలో టిఆర్ఎస్‌ 13, కాంగ్రెస్‌ 6, బిజెపి ఒక స్థానంలో గెలిచాయి. దీంతో అచ్చంపేట టిఆర్ఎస్‌ వశమైంది.  

నకిరేకల్ మున్సిపాలిటీని కూడా టిఆర్ఎస్‌ గెలుచుకొంది. మొత్తం 20 వార్డులలో టిఆర్ఎస్‌ 11, ఫార్వర్డ్ బ్లాక్ 6, కాంగ్రెస్‌ 2 స్థానాలను గెలుచుకొన్నాయి. 

జడ్చర్ల మున్సిపాలిటీలోని 27 సీట్లలో ఇప్పటివరకు 19 వార్డులలో లెక్కింపు పూర్తికాగా వాటిలో టిఆర్ఎస్‌ 16 సీట్లు బిజెపి 2, కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో గెలిచాయి. మెజార్టీ సీట్లు గెలుచుకోవడంతో జడ్చర్ల టిఆర్ఎస్‌ వశమైంది.

కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులలో టిఆర్ఎస్‌ 7, కాంగ్రెస్‌ 5 స్థానాలు గెలుచుకోవడంతో ఇది కూడా టిఆర్ఎస్‌ వశమైంది.   

ఉపఎన్నికల ఫలితాలు: 

నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్ మున్సిపాలిటీలో 18వ వార్డును టిఆర్ఎస్‌ గెలుచుకొంది. 

గజ్వేల్‌లోని ప్రజ్ఞాపూర్‌లోని 12వ వార్డును టిఆర్ఎస్‌ గెలుచుకొంది. 


Related Post