తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ

May 03, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్ధిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రచారంపై హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇటీవల గట్టిగా మందలించినందున కౌంటింగ్ కేంద్రాలలో అన్ని కరోనా జాగ్రత్తలు పాటిస్తూ లెక్కింపు జరిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఓట్లు లెక్కించేవారితో సహా మొత్తం అందరికీ కరోనా లేదని దృవీకరణ పత్రాలున్నవారినే కౌంటింగ్ కేంద్రాలలోకి అనుమతిస్తున్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతో నిర్వహించినందున వాటన్నిటినీ లెక్కించి ఫలితాలు ప్రకటించడానికి కాస్త సమయం పడుతుంది. బహుశః ఈరోజు సాయంత్రం లేదా రాత్రిలోగా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.Related Post