తెలంగాణ జోన్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర

April 20, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో పాత జోన్లతో ఉద్యోగాల భర్తీలో ఎదురవుతున్న సమస్యలకు శాస్విత పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో కొత్త జోన్లను ఏర్పాటు చేసింది. దానికి ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి లోని 1,2 క్లాజుల ద్వారా తనకున్న విచక్షణాధికారాలతో తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్  ఆర్డర్-2018 (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్)కు రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ ఆమోదించినట్లు తెలియజేస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి ఓ గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఈ కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ, బదిలీలు వగైరా జరుగనున్నాయి. ఆ కొత్త జోన్ల వివరాలు: 

మల్టీ జోన్-1: 

కాళేశ్వరం జోన్-1: కుమురంభీం-అసీఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జైశంకర్ భూపాలపల్లి, ములుగు

బాసర జోన్-2: ఆదిలాబాద్‌,  నిర్మల్, నిజామాబాద్‌, జగిత్యాల 

రాజన్న జోన్-3: కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి 

భద్రాద్రి జోన్-4: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్

మల్టీ జోన్-2: 

యాదాద్రి జోన్-5: యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జనగామ 

ఛార్మినార్ జోన్-6: మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ 

జోగులాంబ జోన్-7: జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్ 

పోలీస్ నియమకాలు, బదిలీలకు ఈ పైన పేర్కొన్న జోన్లు వర్తించవు కనుక వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేరేగా ఏర్పాటు చేసిన జోన్లు:

మల్టీ జోన్-1: 

కాళేశ్వరం జోన్-1:  కుమురంభీం-అసీఫాబాద్, జైశంకర్ భూపాలపల్లి, రామగుండం పోలీస్ కమీషనరేట్, ములుగు. 

బాసర జోన్-2: ఆదిలాబాద్‌,  నిర్మల్, నిజామాబాద్‌ పోలీస్ కమీషనరేట్, జగిత్యాల  

రాజన్న జోన్-3:  కరీంనగర్‌ పోలీస్ కమీషనరేట్, సిద్ధిపేట పోలీస్ కమీషనరేట్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి.

భద్రాద్రి జోన్-4: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పోలీస్ కమీషనరేట్, మహబూబాబాద్, వరంగల్‌ పోలీస్ కమీషనరేట్

మల్టీ జోన్-2: 

యాదాద్రి జోన్ 5: నల్గొండ, సూర్యాపేట, రాచకొండ కమీషనరేట్

ఛార్మినార్ జోన్ 6: హైదరాబాద్‌ పోలీస్ కమీషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్, సంగారెడ్డి, వికారాబాద్

జోగులాంబ జోన్ 7: మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్


Related Post