చర్యలు తీసుకొంటారా...ఆదేశాలు జారీ చెయమంటారా? హైకోర్టు

April 19, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఓ పక్క రోజురోజుకీ పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతుంటే, పబ్బులు, మద్యం దుకాణాలను ఎందుకు అనుమతిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. జనాల ప్రాణాల కంటే పబ్బులు, క్లబ్బులే ముఖ్యమా? అని ప్రశ్నించింది. రోడ్లపై జనసంచారం తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకొన్నారని ప్రశ్నించింది. కరోనా కట్టడికి ప్రభుత్వం కటిన నిర్ణయాలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించింది. నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని నిలదీసింది. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే ఆదేశాలు జారీ చేయవలసివస్తుందని ఘాటుగా హెచ్చరించింది. ప్రభుత్వం సమర్పిస్తున్నా నివేదికలలో సమగ్ర సమాచారం ఇవ్వకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భోజనవిరామం తరువాత మళ్ళీ ఈ కేసు విచారణను చేపడతామని, అప్పుడు పూర్తి వివరాలతో రావాలని హైకోర్టు ఏజీకి సూచించింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఏమి చేయదలుచుకొందో స్పష్టమైన సమాధానం చెప్పడానికి సంబందిత శాఖ అధికారులు రావాలని ఆదేశించింది.


Related Post