సన్‌ రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

April 19, 2021


img

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ముచ్చటగా మూడో మ్యాచ్‌లోను పరాజయం పాలైంది. శనివారం రాత్రి చెన్నైలోని ఎమ్ఎ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌- సన్‌ రైజర్స్‌ మద్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో డికాక్ 40, పొలార్డ్ 35 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు. ముంబై ఇండియన్స్‌ ఇచ్చిన 151 పరుగుల టార్గెట్‌ను సన్‌ రైజర్స్‌ ధాటిగా ప్రారంభించింది. కానీ చివరి వరకు అదే ధాటిని కొనసాగించలేక  పరాజయం పాలైంది. సన్‌ రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. సన్‌ రైజర్స్‌  బ్యాటింగ్‌లో వార్నర్, జానీ బెయిర్స్టో తప్ప మిగతా బ్యాట్ మేన్స్ అందరూ చాలా తక్కువ పరుగులు చేశారు.

ఈనెల 21వ తేదీన సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.Related Post