సాగర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు 69 శాతం పోలింగ్

April 17, 2021


img

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా ఎటువంటి సమస్యలు, ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు 69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఎంతమంది నిలిచి ఉంటే అంతమందికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఆ తరువాత కరోనా రోగులకు ఓట్లు వేసే అవకాశం కల్పిస్తారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ తీరు చూస్తే పోలింగ్ ముగిసే సమయానికి కనీసం 78-82 శాతం వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

నేడు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరుగుతోంది. కానీ ఈరోజు డజన్ల కొద్దీ బస్సులలో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు జనాల్ని తీసుకువచ్చినట్లు టిడిపి, బిజెపి నేతలు గుర్తించడంతో చాలా రాద్దాంతం జరుగుతోంది. వారందరూ తిరుమల, చుట్టుపక్కల ఆలయాలను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులని, టిడిపి, బిజెపిలు ఓడిపోతునట్లు ముందే గ్రహించి ఈ సరికొత్త నాటకానికి తెర తీశాయని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. వారి వాదోపవాదాలు సాగుతుండగానే మరోపక్క యధాప్రకారం తిరుపతిలో పోలింగ్ జరిగిపోతోంది. 

మే 2వ తేదీన నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలతో పాటు తిరుపతి, సాగర్ ఫలితాలు కూడా ప్రకటిస్తారు.


Related Post