తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి

April 08, 2021


img

రాష్ట్రంలో కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అరకొర చర్యలపట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కేసులపై గురువారం హైకోర్టు విచారణ జరిపినప్పుడు ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సందించింది. పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

·         కరోనా వ్యాప్తికి కారణమవుతున్న సినిమా థియేటర్లు, పబ్బులు, మద్యం దుకాణాలపై ఎందుకు ఆంక్షలు విధించలేదు?  

·         ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదు? వాటిని 70 శాతంకు పెంచాలి.

·         కరోనా జాగ్రత్తలు, నిబందనలు పాటించనివారిపై ప్రభుత్వం కటినంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

·         సీరో సర్వైలెన్స్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?

·         ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో వాక్సినేషన్ కోసం ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా లేదా?

·         కరోనా కేసులు గుర్తించిన ప్రాంతాలలో మైక్రో కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారా లేదా?   

·         ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నవారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ కలిగి ఉండాలి. రాష్ట్రంలో ప్రవేశించిన తరువాత కూడా వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలి. 


Related Post