తెలంగాణ టిడిపి-ఎల్పీ టిఆర్ఎస్‌లో విలీనం

April 08, 2021


img

తెలంగాణలో టిడిపి చాలాకాలం క్రితమే తన ఉనికి కోల్పోయింది. ఇప్పుడు శాసనసభలో కూడా ఆ పార్టీ ఉనికి కోల్పోయింది. టీడీపీ శాసనసభాపక్షాన్ని టిఆర్ఎస్‌లో విలీనమైపోయింది. టిడిపికి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన నిన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి టిడిపిఎల్పీని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు వారిరువురూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో భేటీ అయ్యి టిడిపిఎల్పీని టిఆర్ఎస్‌లో విలీనంపై చర్చించారు. విలీనానికి ఎటువంటి ఇబ్బంది తలెత్తబోదని దృవీకరించుకొన్న తరువాత స్పీకర్‌ను కలిసి లేఖ ఇచ్చారు. దీంతో తెలంగాణలో టిడిపి ఇంకా ఉన్నప్పటికీ శాసనసభలో పూర్తిగా కనుమరుగైంది. టిడిపిఎల్పీని టిఆర్ఎస్‌లో విలీనంపై టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ ఇంకా స్పందించవలసి ఉంది.    Related Post