సింగరేణిలో ప్రమాదం..ఇద్దరు కార్మికులు మృతి

April 07, 2021


img

భూపాలపల్లి పరిధిలోని కెటికె 6వ నెంబర్ బొగ్గు గనిలో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. గనిలో మూడో సిమ్ 11వ లెవెల్లో కార్మికులు బొగ్గు తవ్వుతుండగా హటాత్తుగా గాని పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో శంకరయ్య, నరసయ్య అనే ఇద్దరు కార్మికులు ఘటనాస్థలంలోనే చనిపోయినట్లు సింగరేణి అధికారులు దృవీకరించారు. గనిలో చిక్కుకుపోయిన మిగిలిన కార్మికులను రక్షించేందుకు ఆ ప్రాంతంలో జేసీబీతో గని పైకప్పును తెరిచేందుకు సింగరేణి అత్యవసర సహాయ సిబ్బంది కృషి చేస్తున్నారు.    Related Post