సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగుతేజం

April 06, 2021


img

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బాబ్డే పదవి కాలం ఈనెల 23న ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీనియార్టీ ప్రకారం జస్టిస్ ఎన్వి రమణ పేరును రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరిస్తారు. ఆయన 2021, ఏప్రిల్ 24 నుండి 2022, ఆగస్టు 26 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు. జస్టిస్ ఎన్వి రమణ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌, కృష్ణాజిల్లాలోని పొన్నవరం గ్రామం.Related Post