తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ జారీ

March 08, 2021


img

తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం ఎంసెట్ షెడ్యూల్‌ ప్రకటించింది. 2021-2022 ఎంసెట్ పరీక్షలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ నుండి 88, రెండో సంవత్సరం సిలబస్ నుండి 72 ప్రశ్నలు ఇస్తారని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 18వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 20 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనరల్ అభ్యర్ధులకు ఎంసెట్ పరీక్ష ఫీజు రూ.800,  దివ్యాంగులకు, ఎస్సీ, ఎస్టీలకు రూ.400గా  ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

ముఖ్యమైన తేదీలు: 

మార్చి 18 -ఎంసెట్ నోటిఫికేషన్ జారీ

మార్చి 20 -ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ 

మే 18 -దరఖాస్తుల చివరి తేది

మే 18 నుండి మే 27వ తేదీ వరకు రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తులు సమర్పించవచ్చు.

జూలై 5,6- ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష

జూలై 7, 8,9- ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష.


Related Post