కశ్మీర్‌లో పనిచేస్తున్న జవాన్లకు హెలికాప్టర్‌ సౌకర్యం

February 27, 2021


img

కశ్మీర్‌ అంటే ఒకప్పుడు ఈ భూమ్మీద సుందరమైన ప్రదేశాలలో ఒకటిగా ఉండేది. కానీ గత 3-4 దశాబ్ధాలుగా వేర్పాటువాదం, పాక్‌ ఉగ్రవాదం, సరిహద్దులలో కాల్పుల కారణంగా కశ్మీర్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ మన జవాన్లు తమప్రాణాలను పణంగాపెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని అర్ధమవుతుంది. వారిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నప్పుడు పుల్వామా తరహా ఉగ్రదాడులు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతుంటారు. కనుక తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రమూకల నుంచి దేశాన్ని కాపాడుతున్న జవాన్లను ఇకపై హెలికాప్టర్‌ ద్వారా తరలించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.

అంతేకాదు...ఇకపై జవాన్లు, ఆర్మీ అధికారులు శలవుపై సొంత ఊర్లకు బయలుదేరేటప్పుడు, తిరిగివస్తున్నప్పుడు కూడా వారిని హెలికాప్టర్‌లో గమ్యస్థానానికి చేర్చాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అయితే వివిద రాష్ట్రాలలోని వివిద ప్రాంతాలకు చెందిన జవాన్లను హెలికాప్టర్‌లో వారి స్వస్థలాల వద్ద దింపి తిరిగి తీసుకురావడం చాలా కష్టం కనుక వారు పనిచేస్తున్న  ప్రాంతం నుంచి సమీపంలోని శ్రీనగర్ విమానాశ్రయం వరకు, మళ్ళీ వారు తిరిగి వచ్చినప్పుడు అక్కడి నుంచి వారు పనిచేస్తున్న ప్రాంతానికి మాత్రమే హెలికాప్టర్‌లో తీసుకువెళ్ళి విడిచే అవకాశం ఉందని ఆర్మీ అధికారులు చెపుతున్నారు.


Related Post