హైకోర్టును ఆశ్రయించిన వామన్‌ రావు తండ్రి

February 27, 2021


img

హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో వామన్ రావు గట్టు కిషన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తునందుకే తన కుమారుడిని, కోడలిని హత్య చేయించారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు, కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఉనందునే పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదని కనుక ఈ కేసును సిబిఐకి అప్పగించాలని గట్టు కిషన్‌రావు హైకోర్టును పిటిషన్‌ ద్వారా అభ్యర్ధించారు. ఈ కేసులో కేంద్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డిజిపి మహేందర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, రామగుండం పోలీస్ కమీషనర్, డీసీపీ, గోదావరిఖని ఏసీపీ, మంథని సీఐ, రామగిరి ఎస్సైలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. సోమవారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది.   



Related Post