కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమిద్దాం: బోయినపల్లి వినోద్ కుమార్

February 23, 2021


img

సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళిక అధ్యక్షుడు బోయినపల్లి  వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.  రాష్ట్ర ప్రణాళిక సంఘ అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కొరకు ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ముఖ్యంగా కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం స్పందించటం లేదని అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దిగివచ్చి ఏర్పాటు చేస్తుందని అన్నారు. రాష్ట్రం ఉద్యమాల ద్వారానే ఏర్పడింది కనుక రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా ఉద్యమాల ద్వారానే సాధించుకుందామని అన్నారు.Related Post