రెండు ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా నామినేషన్లు

February 23, 2021


img

రాష్ట్రంలో మార్చి 14న జరుగబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. నేటితో నామినేషన్ల దాఖలుకి గడువు ముగుస్తుండటంతో ఈరోజు కూడా మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. 

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి నిన్నటివరకు ప్రధాన పార్టీల అభ్యర్ధులతో సహా మొత్తం 59మంది అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. 

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి నిన్నటివరకు మొత్తం 48 మంది నామినేషన్లు వేశారు. 

వీరిలో టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి, టిజేఎస్‌, వామపక్షాలు బలపరిచిన అభ్యర్ధుల మద్య ప్రధానంగా పోటీ సాగుతుందని వేరే చెప్పక్కరలేదు. వీరుకాక స్వతంత్ర అభ్యర్ధులలో కూడా కొందరు బలమైన అభ్యర్ధులున్నారు. అదీగాక దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో పరాభవం పొందిన టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలలో తప్పనిసరిగా గెలిచి తీరాల్సి ఉంటుంది. కనుక ఆ రెండు పార్టీలు గట్టిగానే పోరాడబోతున్నాయి. కనుక ఈసారి ఎన్నికలలో పోటీ చాలా తీవ్రంగా ఉండబోతోందని భావించవచ్చు.        

ఎన్నికల షెడ్యూల్: 

ఫిబ్రవరి 16: నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 23: నామినేషన్లు దాఖలుకు చివరి రోజు 

ఫిబ్రవరి 24: నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 26: నామినేషన్ల ఉపసంహరణ

మార్చి 14: పోలింగ్ (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

మార్చి 17: ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.


Related Post