తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం

February 23, 2021


img

హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు తరువాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 338 కిమీ పొడవున రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కారీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. రెండు దశలలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 17,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదటి దశ పనులకు సుమారు రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనిలో భూసేకరణకే సుమారు రూ. 4,000 కోట్లు అవుతుంది. మొదటిదశ ప్రాజెక్టు పనులలో రాష్ట్ర వాటాగా రూ.1,905 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 

ఈ రీజినల్ రింగ్ రోడ్డు మొదటిదశలో హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుకు సుమారు 30 కిమీ దూరంలో సంగారెడ్డి నుంచి తూప్రాన్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మిస్తారు. దీనినే జాతీయ రహదారి 161-ఏఏగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకొన్నాయి. 

ఈ రీజినల్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-పూణే-నాగపూర్ రెండు జాతీయరహదారులతో అనుసంధానం అవుతుంది. 


Related Post