తెలంగాణ పోలీస్ శాఖకు రెండు రాష్ట్రపతి పతకాలు

January 26, 2021


img

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న పోలీసులకు, పోలీస్ ఉన్నతాధికారులకు అవార్డులు ప్రకటించింది. వాటిలో తెలంగాణ పోలీస్ శాఖకు ప్రతిష్టాత్మకమైన రెండు రాష్ట్రపతి పతకాలు, 12 పోలీస్ మెడల్స్ లభించాయి. 

హైదరాబాద్‌ అడిషనల్ సీపీ శిఖా గోయల్, నిజామాబాద్‌ ఐజీ శివశంకర్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పతకాలు అందుకోనున్నారు.  

పోలీస్ పతకాలకు ఎంపికైన వారి వివరాలు: 

1. షరీఫుద్దీన్ సిద్ధిఖీ (క‌మాండెంట్, టీఎస్ఎస్ఎస్పీ బెటాలియ‌న్ హైద‌రాబాద్‌)

2. రాజేష్ కుమార్ (ఐజీ ఇంటలిజన్స్ డిపార్ట్‌మెంట్, హైద‌రాబాద్‌)

3. గోవర్ధన్ తన్నీరు (ఏసీపీ, హైద‌రాబాద్‌)

4. సూర్యనారాయణ (డీఎస్పీ, ఏసీబీ రంగారెడ్డి)

5. గుంజ ర‌మేశ్‌(డిప్యూటీ అస‌ల్ట్ క‌మాండ‌ర్, గ్రే హౌండ్స్‌)

6. కందుకూరి న‌ర్సింగ‌రావు(డిఎస్పీ, నిర్మ‌ల్‌)

7. ఎం ఉద్ధ‌వ్(కానిస్టేబుల్, టీఎస్ఎస్ఎస్పీ 13వ బెటాలియ‌న్‌, మంచిర్యాల‌). 


Related Post