కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర

January 26, 2021


img

గత ఏడాది జూన్15వ తేదీ అర్ధరాత్రి లడ్డాక్‌లోని గాల్వాన్ లోయలో చొరబడిన చైనా సైనికులను అడ్డుకొనే ప్రయత్నంలో వారి దాడిలో చనిపోయిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రప్రభుత్వం పరమవీర్ చక్ర అవార్డు ప్రకటించింది. ఇవాళ్ళ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన భార్య సంతోషి ఈ అవార్డును అందుకోనున్నారు. 

బిహార్ రెజిమెంటుకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 20 మంది భారత జవాన్లు కూడా చనిపోయారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున సిఎం కేసీఆర్‌ రూ.5 కోట్లు ఆర్ధికసాయం, ఆయన భార్య సంతోషికి గ్రేడ్-2 ప్రభుత్వోద్యోగం, హైదరాబాద్‌లో నివాసస్థలం ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే.   Related Post