బోధన్‌లో భారీ అగ్నిప్రమాదం

January 23, 2021


img

నిజామాబాద్‌ జిల్లా, బోధన్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక హనుమాన్ ఆలయం వద్ద ఉన్న టైర్ల దుకాణంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దాని పక్కనే ఫర్నిచర్ దుకాణం కూడా ఉండటంతో మంటలు శరవేగంగా దానికి కూడా వ్యాపించాయి. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు పది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.Related Post