అఖిలప్రియకు బెయిల్‌పై మంజూరు

January 23, 2021


img

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. భూమా అఖిలప్రియ చంచల్‌గూడ జైల్లో 17రోజుల రిమాండ్ అనంతరం శుక్రవారం బెయిల్ మంజూరైంది. 

 ఆమె బెయిల్‌పై పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సికింద్రాబాద్‌ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. పదివేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు షూరిటీ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇవాళ్ళ బెయిల్‌ ఉత్తర్వులు కోర్టు నుండి జైలు అధికారులకు చేరగానే అఖిలప్రియను జైలు నుండి విడుదల చేస్తారు. ఈ కిడ్నాప్ కేసులో ఏ-3గా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ దాఖలు చేసుకొన్న ముందస్తు బెయిల్‌పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని పోలీసులు కోర్టుకు తెలిపారు.


Related Post