కేటీఆర్‌ సిఎం పదవికి అర్హుడు: టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే

January 22, 2021


img

మంత్రి కేటీఆర్‌కు మరో ఎమ్మెల్యే ఇవాళ్ళ జై కొట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం శుక్రవారం జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వం ఆలయానికి రూ.37 కోట్లు కేటాయించిందన్నారు. దర్శనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం మీడియాతో అబ్రహం మాట్లాడుతూ కెసిఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాల అర్హుడని అన్నారు.



Related Post