ఆ హీరోయిన్ కు పెళ్లయింది తెలుసా..!

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు దాటినా చెప్పుకోడానికి కేవలం రెండు మూడు సినిమాలే సక్సెస్ లు ఉన్న సుమంత్ ఈమధ్య మళ్లీ రావా సినిమాతో హిట్ అందుకున్నాడు. సినిమా చూసిన ఆడియెన్స్ మాత్రమే కాదు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు కూడా ప్రశంసలు అందించారు. ఇన్నాళ్లకు సుమంత్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడని చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్. 

సినిమాలో ఆమె అభినయంతో అందరిని మెప్పించింది. హింది సీరియల్స్ లో నటించి ఆమెను చూసి మనవాళ్లు ఇంప్రెస్ అవుతున్నారు. అయితే ఆమెకి ఆల్రెడీ పెళ్లైందన్న వార్త విని అందరు షాక్ అవుతున్నారు. 16 ఏళ్ల వయసులోనే ఆమె ప్రేమించిందట. 20 ఏళ్లకే ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిందట. అతని సపోర్ట్ తోనే సీరియల్స్ చేస్తున్నానని.. దర్శకుడు గౌతం తనని కలిసి కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పిందని అంటుంది ఆకాంక్ష.