రంగస్థలంకు రిపేర్లు తప్పట్లేదట..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా రషెష్ చూసిన చిరంజీవి కొన్ని రిపేర్లు చెప్పాడని తెలుస్తుంది. అంతేకాదు కొన్ని సీన్స్ మరి ఎక్కువ లెంగ్త్ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయని చెప్పాడట. ఈ మేరకు రంగస్థలం సినిమాకు కొన్ని రిపెర్లు తప్పట్టు లేదనిపిస్తుంది.

సుకుమార్ డ్రీం ప్రాజెక్ట్ గా రాబోతున్న రంగస్థలం సినిమా నుండి ఈమధ్యనే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచేయగా సినిమా ఆ అంచనాలను అందుకునేలా తెరకెక్కిస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మార్చి 30న రిలీజ్ ఎనౌన్స్ చేశారు. స్టార్ సినిమా అంటే రీషూట్లు తప్పని సరి అని తెలుస్తుంది. వందల కోట్ల బడ్జెట్ తో వస్తున్న సినిమాలు ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయాలంటే రిపేర్లు తప్పట్లేదు. 

ఒకప్పుడు ఓ సినిమా రీషూట్ జరుపుకుంటుంది అంటే దానిపై ఓ నెగటివ్ టాక్ వచ్చేది. కాని ఇప్పుడు స్టార్ సినిమాలన్ని దాదాపు అన్ని అదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. కాబట్టి రంగస్థలం కూడా రిపేర్లు ఎన్నున్నా మెగా పవర్ చాటేలా ఉంటుందని అంటున్నారు.