
ఫిదాతో కమర్షియల్ గా మొదటి హిట్ అందుకున్న వరుణ్ తేజ్ అదే జోష్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఓ కమర్షియల్ హిట్ వచ్చింది కాబట్టి దాని వెంటనే ఓ స్టార్ హీరో సినిమా చేసేద్దాం అన్న ఆలోచన కాకుండా మళ్లీ కొత్త వారికి అవకాశం ఇస్తూ సత్తా చాటుతున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో తొలిప్రేమ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ తన తర్వాత సినిమాను ఘాజి డైరక్టర్ సంకల్ప్ రెడ్డితో ఫిక్స్ చేసుకున్నాడట.
ఇక ఇదే కాకుండా మరో షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వరుణ్ తేజ్. ఇండియన్, ఏజ్ 25 షార్ట్ ఫిలింస్ తీసిన శశికుమార్ ఓ క్రేజీ స్టోరీని వరుణ్ తేజ్ కు వినిపించాడట. కథ నచ్చేయడంతో సినిమా చేస్తానని కన్ఫాం చేశాడట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తాడని తెలుస్తుంది. తొలిప్రేమ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తుంది.