
మలయాళ ప్రేమం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి ఆ సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో ఫిదా సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం నాని సరసన సాయి పల్లవి నటించిన ఎం.సి.ఏ సినిమా ఈ నెల 21న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో నాని, సాయి పల్లవి మాత్రమే కాదు ఒకప్పటి హీరోయిన్ భూమిక కూడా స్పెషల్ రోల్ చేస్తుంది.
సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే సినిమాలో సాయి పల్లవిని భూమిక పాత్ర డామినేట్ చేసిందని అనిపిస్తుంది. ఇక హీరోయిన్ గా కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసిన భూమిక కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన సినిమా ఎం.సి.ఏ. ఖుషి, ఒక్కడు సినిమా టైంలో ఆమెకు యూత్ ఫ్యాన్స్ బీభత్సంగా ఉండే వారు మరి సాయి పల్లవి పక్కన ఎక్కువ మార్కులు కొట్టేలా ఉన్న భూనిక ఓవరాల్ గా సినిమా హిట్ కు సహకరిస్తుందని చెప్పొచ్చు.