
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా మాస్ అండ్ కమర్షియల్ డైరక్టర్ వి.వి.వినాయక్ డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ముందు ఇంటెలిజెంట్ అనే టైటిల్ అనుకోగా ఇప్పుడు ఆ సినిమాకు టైటిల్ గా ధర్మా భాయ్ అని పెట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఖైది నంబర్ 150 తర్వాత స్టార్స్ అందరు సినిమాలతో బిజీ అవడం వల్ల సాయి ధరం తేజ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు వినాయక్.
ఆకుల శివ అందించిన ఈ కథకు టైటిల్ గా ధర్మా భాయ్ అన్నది సూట్ అవుతుందని అదే ఫైనల్ చేస్తున్నారట. ఇక టైటిల్ చూస్తుంటే వినాయక్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా సాయి ధరం తేజ్ కరుణాకరణ్ సినిమా కూడా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది. మరి సాయి ధరం తేజ్ తో వినాయక్ చేస్తున్న ఈ ధర్మా భాయ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.