
శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ లీడ్ రోల్స్ లో పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన సినిమా మెంటల్ మదిలో. వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా పబ్లిక్ టాక్ బాగున్నా సినిమా కమర్షియల్ గా సూపర్ అనిపించలేదు. ఓవరాల్ గా నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టిన ఈ సినిమాతో దర్శకుడి టాలెంట్ ఏంటో అర్ధమైంది. అందుకే వెంటనే మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట రాజ్ కందుకూరి.
తనకు వివేక్ చెప్పిన మొదటి కథను ఇప్పుడు సినిమాగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాకు బ్రోచేవారెవరురా అనే టైటిల్ పెట్టనున్నారట. సురేష్ బాబు ఈ సినిమాకు సమర్పకుడిగా ఉంటున్నాడని తెలుస్తుంది. మెంటల్ మదిలో సినిమా కాస్ట్ అండ్ క్రూతోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తూం శ్రీవిష్ణు నీది నాది ఒకే కథ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.