
బాహుబలి తర్వాత ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తన తర్వాత సినిమా ప్లాన్ చేశాడు. రాం చరణ్, ఎన్.టి.ఆర్ లతో మల్టీస్టారర్ మూవీ ఫిక్స్ చేసిన రాజమౌళి ఈ సినిమాను నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చేలా కృషి చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలిసిందే. ఇక సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ అందాల భామలను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట. సినిమా బడ్జెట్ కూడా 150 కోట్ల పైనే కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదని రాజమౌళి అనుకుంటున్నాడట. అసలైతే సినిమాలో ఒక హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయెల్ ఓకే అన్నట్టు వార్తలొచ్చినా అవేవి నిజం కాదని తెలుస్తుంది. మొత్తానికి నేషనల్ వైడ్ క్రేజ్ కోసం హీరోలు మన వాళ్లున్నా హీరోయిన్స్ మిగతా ఆర్టిస్టులను అక్కడి నుండి పట్టుకొస్తున్నాడు రాజమౌళి.