కొత్త బిజినెస్ లోకి రాం చరణ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగానే కాదు మంచి బిజినెస్ మ్యాన్ గా కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం హీరోగా ఉంటూనే ట్రూజెట్ ఎయిర్ లైన్ తో పాటుగా ఫుట్ బాల్, కబడ్డి జట్టులను కొనేసిన రాం చరణ్ కొత్తగా థియేటర్ లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో థియేటర్స్ ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నాడట రాం చరణ్.

కొంతమంది బడా నిర్మాతల చేతుల్లోనే రెండు రాష్ట్రల్లో థియేటర్స్ ఉన్నాయని కొంత కామెంట్ ఎప్పుడు వినిపిస్తున్నదే. అయితే చరణ్ కొత్తగా ఏర్పరచే థియేటర్స్ చిన్న సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ఉంటాయట. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారితో కలిసి రాం చరణ్ ఈ మిని థియేటర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి చెర్రి ఈ బిజినెస్ ఎలా ఉండబోతుందో చూడాలి.