రవితేజ అతనితో కన్ఫాం చేశాడు..!

మాస్ మహరాజ్ రవితేజ రెండేళ్ల తర్వాత రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ అందుకున్నాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమాతో పాటుగా చేస్తున్న టచ్ చేసి చూడు సినిమా కూడా రిలీజ్ ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం తర్వాత సినిమాకు కథలను వింటున్న రవితేజ సోగ్గాడు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణతో సినిమా కన్ఫాం చేశాడని తెలుస్తుంది. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో సూపర్ హిట్లు అందుకున్న కళ్యాణ్ కృష్ణ రవితేజకు అదిరిపోయే కథ సిద్ధం చేశాడట.

అసలైతే అక్కినేని నాగార్జునతోనే బంగార్రాజు సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా కథ విషయంలో ఇద్దరి మధ్య దూరం ఏర్పడిందట. నాగార్జున ఇచ్చిన సలహాలతో అసంతృప్తిగా ఉన్న కళ్యాణ్ కృష్ణ బయటకు వచ్చి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. తను చెప్పిన కథకు రవితేజ ఓకే చెప్పగా చుట్టాలబ్బాయ్ సినిమా నిర్మించిన రాం ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు వస్తుందని అంటున్నారు.