
కోలీవుడ్ సూర్య ప్రస్తుతం చేస్తున్న సినిమా తాన సెండ్ర కూట్టం తెలుగులో గ్యాంగ్ పేరుతో రిలీజ్ అవుతుంది. యువి క్రియేషన్స్ వారు తెలుగులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. సిబిఐ ఆఫీసర్ గా సూర్య కనిపిస్తుండగా సూర్య పక్కన రమ్యకృష్ణ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టు తెలుస్తుంది. విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది.
ఇక సినిమా తెలుగు టీజర్ లో సర్ ప్రైజ్ ఏంటంటే.. సూర్య మొదటిసారి తెలుగు డబ్బింగ్ చెప్పడమే.. ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులకు సూర్య వాయిస్ లో వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు. కాని మొట్టమొదటిసారి సూర్య తన పాత్రకు తానే తెలుగు డబ్బింగ్ చెప్పుకున్నాడు. కచ్చితంగా సూర్య ప్రయత్నానికి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతాడని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ లో అనిరుద్ మ్యూజిక్ అలరించింది.. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. మరి గట్టి పోటీ ఉన్న పొంగల్ వార్ లో సూర్య తన సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి.