ఇన్నాళ్లకు కలిసి చేస్తున్నారు..!

వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెల్సిందే. ఆ సినిమాకు దర్శకుడు విజయ భాస్కర్ అయినా మాటలను అందించింది మాత్రం త్రివిక్రం శ్రీనివాస్. సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోశించిన త్రివిక్రం ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. ఇక ఇప్పుడు డైరక్టర్ గా టాప్ రేంజ్ లో ఉన్న త్రివిక్రం మరోసారి వెంకటేష్ తో కలిసి సినిమా చేస్తున్నాడు.   


ఈసారి వెంకటేష్ ను డైరక్టర్ గా డీల్ చేస్తున్నాడు త్రివిక్రం శ్రీనివాస్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో ప్రొడక్షన్ నెంబర్ 6 గా వెంకటేష్ త్రివిక్రం సినిమా తెరకెక్కనుంది. ఈరోజు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం తేజతో ఆటా నాదే వేటా నాదే సినిమా చేస్తున్న వెంకటేష్ ఆ తర్వాత త్రివిక్రం సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇక త్రివిక్రం శ్రీనివాస్ కూడా ఎన్.టి.ఆర్ సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఆ సినిమా తర్వాత వెంకటేష్ సినిమా చేస్తాడట.