తొలిప్రేమ దర్శకుడితో మెగా మేనళ్లుడు..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తేజ్ రీసెంట్ గా వచ్చిన జవాన్ తో సత్తా చాటుకున్నాడు సాయి ధరం తేజ్. ప్రస్తుతం వినాయక్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న తేజ్ ప్రేమకథల స్పెషలిస్ట్ డైరక్టర్ కరుణాకరణ్ తో సినిమా షురూ చేశాడు. ఈరోజు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం విశేషం.

ప్రేమకథతోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. కెరియర్ లో పక్కా లవ్ స్టోరీతో సాయి ధరం తేజ్ సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ లాంటి హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు కచ్చితంగా తనకు ఓ సూపర్ హిట్ సినిమా ఇస్తాడని అంటున్నారు. కె.ఎస్ రామారావు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.