మహేష్ సోదరి నిర్మాణంలో నాని..!

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీరాం వేణు డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఎం.సి.ఏ. డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మేర్లపాక గాంధి కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు నాని. ఆ సినిమా ఆల్రెడీ షూటింగ్ నడుస్తుండగా మరో 20 రోజులు నాని షెడ్యూల్ పూర్తి చేస్తే అది కూడా ఫినిష్ అవుతుందట. ఇక దాని తర్వాత మహేష్ సోదరి మంజుల నిర్మాణంలో నాని సినిమా ఉంటుందని తెలుస్తుంది.

విక్రం కుమార్ డైరక్టర్ లో నాని చేయబోతున్న సినిమాను ఇందిర ప్రొడక్షన్స్ బ్యానర్లో మంజుల నిర్మించేందుకు ఓకే అన్నదట. ప్రస్తుతం విక్రం కుమార్ హలో ప్రమోషన్స్ లో ఉన్నాడు. అది రిలీజ్ అయ్యాక అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారట. నాని సినిమా తర్వాత విక్రం మరోసారి అక్కినేని హీరోతో పనిచేస్తాడని అంటున్నారు. మంజుల డైరక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా మనసుకి నచ్చింది సినిమా చేస్తుంది. ఓ పక్క డైరక్టర్ గా చేస్తూనే మరో పక్క నిర్మాతగా దూసుకెళ్లాలని చూస్తుంది ఘట్టమనేని వారసురాలు.